Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..
Kishan Reddy: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట విషాదం..
Kishan Reddy: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు జీవన్ రెడ్డి(47) గుండెపోటుతో కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని సైదాబాద్ వినయ్‌నగర్‌లో కిషన్‌రెడ్డి అక్క బావ లక్ష్మీ, నర్సింహారెడ్డి నివాసం ఉంటారు. వాళ్ల కుమారుడే జీవన్‌రెడ్డి. జీవన్‌రెడ్డి తన నివాసంలో నిన్న ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. నోయిడాలో ఉన్న కిషన్ రెడ్డికి ఈ విషయం తెలియడంతో వెంటనే హైదరాబాద్ కు బయల్దేరారు. జీవన్ రెడ్డికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.