Kishan Reddy: యూసుఫ్‌గూడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

Kishan Reddy: దెబ్బతిన్న నాలాలను పరిశీలించిన కిషన్ రెడ్డి

Update: 2023-07-28 07:15 GMT

Kishan Reddy: యూసుఫ్‌గూడలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పర్యటన

Kishan Reddy: జూబ్లిహిల్స్ నియోజకవర్గం యూసుఫ్‌గూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. డివిజన్‌లో వరదల ప్రభావం ఉన్న కాలనీల్లో పర్యటించారు. వెంకటగిరి, కృష్ణా నగర్ ప్రాంతాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చి, నాలాలు పొంగాయి. బస్తీల్లోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న నాలాల్ని పరిశీలించారు కిషన్ రెడ్డి. వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్య తీవ్రతను వివరించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో అధికారులు అందుబాటులో ఉండాలని కోరారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.

Tags:    

Similar News