తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి.. రేస్‌లో ఉన్నది వీళ్లే..!

Union Ministry Post: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోంది.

Update: 2023-01-30 09:06 GMT

తెలంగాణకు మరో కేంద్రమంత్రి పదవి.. రేస్‌లో ఉన్నది వీళ్లే..!

Union Ministry Post: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరగబోతోంది. కేబినెట్ విస్తరణలో తెలంగాణ నుంచి ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌‌లలో ఒకరికి కేబినెట్‌లో ఛాన్స్ రానుంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డి పని చేస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో కేబినెట్‌ విస్తరణలో తెలంగాణ నుంచి మరొకరికి ఛాన్స్‌ ఇవ్వనుంది కేంద్రం.

బీసీ సామాజిక వర్గం నుంచి మొగ్గు చూపితే ధర్మపురి అర్వింద్‌కు ఎస్సీ సామాజిక వర్గం అవకాశం ఇద్దామని భావిస్తే సోయం బాపురావుకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఇటీవల బీజేపీ బహుజన మంత్రం జపించడంతో పాటు ఢిల్లీ కార్యవర్గ సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. అందువల్ల సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేస్తే ధర్మపురి అర్వింద్, సోయంబాపు రావులలో ఒకరికి కేబినెట్‌లో బెర్త్ దక్కే అవకాశం మెరుగ్గా ఉంది. అయినా బండి సంజయ్, డాక్టర్‌ లక్ష్మణ్‌లు కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. 

Tags:    

Similar News