Pension: పెన్షన్ దారులకు బిగ్ అలర్ట్..ఈ కార్డు ఉంటేనే వచ్చే నెల నుంచి పెన్షన్

Update: 2025-03-05 02:30 GMT

Pension: పెన్షన్ దారులకు బిగ్ అలర్ట్. ముఖ్యంగా దివ్యాంగులకు యూడిఐడి నెంబర్ జనరేట్ చేయాలని కరీంనర్ సెర్ఫ్ దివ్యరాజ్ తెలిపారు. సోమవారం సదరం సర్టిఫికేట్ల నుంయి యూనిక్ డిసేబులిటీ ఐడి జారీ చేయాలన్నారు. కరీంనగర్ లో ఉన్న దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ బదులు యూనిక్ డిసేబులిటి ఐడీ జారీ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సదరం సర్టిఫికేట్ నుంచి ఈ కార్డు జారీ చేసేందుకు ప్రభుత్వం నిర్దేధించిన మార్గదర్శకాలను అనుసరించాలని తెలిపారు.

దివ్యాంగులకు వైద్యులచే ధ్రువీకరించిన వైకల్య శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ ను యూడిఐడి పోర్టల్ లో నమోదు చేయాలని దివ్యాంగులకు సంబంధించిన ఇతర వివరాలు సంపూర్ణంగా నమోదు చేయాలన్నారు. దివ్యాంగులకు యూడిఐడి కార్డు స్పీడ్ పోస్టు ద్వారా నేరుగాఇంటి అడ్రస్ కు అందుతుందని తెలిపారు. అంధులకు విజన్, కుష్టు వ్యాధి గ్రస్తులకు, వినికిడి సమస్య గలవారు, అంగవైకల్యం గలవారు, మానసిక వైకల్యం గలవారికి వైకల్య శాతాన్ని పరిశీలించి యూడిఐడి కార్డులు జారీ చేయాల్సి ఉంటుందన్నారు. నూతనంగా యూడిఐడి కార్డుల కోసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సదరం సర్టిఫికేట్ ఉన్నవారికి జిల్లా గ్రామీణ అభివ్రుద్ధి శాఖ అధికారి ద్వారా యూడిఐడి జనరేట్ చేస్తారని తెలిపారు.

ఫిబ్రవరి 28,2025 వరకు జారీ చేసిన సదరం సర్టిఫికెట్లతో పెన్షన్, ఇతర సదుపాయాలను దివ్యాంగులు పొందవచ్చని, ఇతర రాష్ట్రాల్లో ఏదైనా సౌకర్యం పొందాలంటే దివ్యాంగులకు యూ.డి.ఐ.డి కార్డు తప్పనిసరి అన్నారు. మార్చి ఒకటి నుంచి దివ్యాంగులకు యూ.డి.ఐ.డి జారీ చేయడం జరుగుతుందన్నారు. వీటి ద్వారానే పెన్షన్, ఇతర సౌకర్యాలు పొందాల్సి ఉంటుందని తెలిపారు. 

Tags:    

Similar News