Kothagudem: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

Kothagudem: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు భద్రాద్రి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది.

Update: 2023-08-03 10:46 GMT

Kothagudem: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

Kothagudem: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు భద్రాద్రి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. గత సంవత్సరం నవంబర్‌లో చండ్రగొండ మండలం బెండళపాడు గ్రామ పంచాయతీ ఎర్రబోడు అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ప్లాంటేషన్ పనులను సందర్శించడానికి వెళ్లిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు గొత్తి కోయల చేతిలో వేట కొడవళ్లతో దారుణ హత్యకు గురయ్యారు. హత్య చేసిన ఎర్రబోడు గ్రామానికి చెందిన మడకం తుల, పోడియం నంగాలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ జీవిత ఖైదుతో పాటు ఇద్దరికి చెరొక వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Tags:    

Similar News