Heavy Rains: తెలంగాణలో 26, 27న విద్యాసంస్థలకు సెలవులు..
తెలంగాణలో 26, 27న విద్యాసంస్థలకు సెలవులు..
తెలంగాణలోని విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులపాటు సెలవులు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తోన్న నేపథ్యంలో 26, 27న విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు సెలవులకు సంబంధించి తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖను సీఎం కేసీఆర్ ఆదేశించారు.