Tummala: హస్తం గూటికి తుమ్మల.. ఎవరి సమక్షంలో చేరికంటే..?
Tummala Nageswara Rao: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు.
Tummala: హస్తం గూటికి తుమ్మల.. ఎవరి సమక్షంలో చేరికంటే..?
Tummala Nageswara Rao: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కాంగ్రెస్ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. హైటెక్‌సిటీలోని తుమ్మల నివాసంలో AICC ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి ఆయన్ను కలిశారు. CWC సమావేశాల్లో తుమ్మల కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండగా.. అధిష్టానం తరపున పార్టీలోకి ఆహ్వానించేందుకు మాణిక్ రావు ఠాక్రే తుమ్మలతో సమావేశమైనట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ నెల 17న హైదరాబాద్‌లో సోనియాగాంధీతో భారీ బహిరంగ సభ జరగనుంది. అలాగే హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశం కూడా జరగనుంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలంతా తరలివస్తున్నారు. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లిఖార్జునఖర్గే, తదితర ముఖ్యనేతలంతా భాగ్యనగరానికి తరలివస్తున్నారు. వీరి సమక్షంలోనే తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.