Kamareddy: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

Kamareddy: ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగిందన్న ప్రయాణికులు

Update: 2024-01-16 13:03 GMT

Kamareddy: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్‌లో ఉండగానే. అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చిన్న గుంతలోకి దూసుకుపోయింది. ఎడమ పక్కకు ఒరిగిపోయింది.ఈ ఘటన గాంధారి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. గుడిమెట్ శివారులో బాన్సువాడ- కామారెడ్డి రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. ఈ ప్రమాదానికి గురైంది. ప్రమాదంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన గురయ్యారు. అదృష్టవశాత్తు గుంతలోకి వెళ్లి బస్సు ఆగిపోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోలేదు. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందని ప్రయాణికులు తెలిపారు.

Tags:    

Similar News