Vikarabad Accident: వికారాబాద్ ఘటన.. మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
Vikarabad Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Vikarabad Accident: వికారాబాద్ ఘటన.. మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్
Vikarabad Accident: వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధారూర్ మండలం కేరెల్లి గ్రామ పంచాయతి పరిధిలోని బాచారం మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆటోలో 11 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిసింది. ఈ ఘటనకు కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని వికారాబాద్ చౌరస్తాలో బంధువులు, గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కాగా వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను వికారాబాద్ ఎస్‌పీ కోటిరెడ్డి పరామర్శించారు. ప్రమాద వివరాలను ఎస్‌పీ అడిగి తెలుసుకున్నారు.