Hyderabad: దీపావళి వేడుకుల్లో తీవ్ర విషాదం.. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త మృతి

Hyderabad: 80 శాతం గాయాలతో గాంధీలో చికిత్స పొందుతున్న భార్య

Update: 2023-11-13 05:02 GMT

Hyderabad: దీపావళి వేడుకుల్లో తీవ్ర విషాదం.. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్త మృతి

Hyderabad: హైదరాబాద్‌ మల్కాజ్‌గిరిలో దీపావళి వేడుకుల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రేమ్‌ విజయనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న వృద్ధ దంపతులు రాఘవరావు, ఆయన సతీమణి రాఘవమ్మ దీపాలు వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకున్నాయి. భార్యను కాపాడే ప్రయత్నంలో తీవ్రగాయాలలో భర్త రాఘవరావు మృతి చెందారు.

80 శాతం గాయాలపాలైన భార్య రాఘవమ్మ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో రాఘవరావు దంపతులు నివాసముంటున్నారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Tags:    

Similar News