లింగమతుల జాతరను ఘనంగా నిర్వహిస్తోన్న ప్రభుత్వం

Update: 2021-02-27 15:24 GMT

రెండేళ్లకు ఓసారి జరిగే జాతర. సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర అది. ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. దురాజ్‌పల్లిలో జరిగే లింగమతుల జాతరపై HMTV స్పెషల్‌ స్టోరీ.

తెలంగాణలో సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర లింగమతుల జాతర. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌ పల్లి గ్రామంలో ఈ జాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. జాతరకు 15 రోజుల ముందే దిష్టి పూజ నిర్వహించడం ఆనవాయితీ కాగా.. మార్చి 4 వరకు లింగమతుల జాతర జరగనుంది. అయితే ఈసారి జాతరకు ప్రభుత్వం 2కోట్ల రూపాయలను కేటాయించింది.

స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. లక్షాలాది మంది జాతరకు వస్తుండగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా డ్రింకింగ్‌ వాటర్, మరుగుదొడ్లు, చలవపందిళ్లు, ఏర్పాటు చేశారు. రెండేళ్లకు ఓసారి జరిగే పెద్దగట్టు జాతరకు యాదవులు ఓలింగ.. ఓలింగ అంటూ కత్తులు చేతబూని, డప్పు వాయిద్యాల మధ్య స్వామివారిని దర్శించుకుంటున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ జాతీయరహదారికి సమీపంలో జాతర జరుగుతుండటం ఆదివారం నుంచే జాతర ప్రారంభంకావడంతో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. హైదరాబాద్‌ టూ విజయవాడ వెళ్లే వాహనాలను నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్‌ నగర్‌తోపాటు కోదాడ మీదుగా దారి మళ్లించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Tags:    

Similar News