Telangana Formation Day: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

Telangana Formation Day: తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిన రోజు ఇది.

Update: 2021-06-02 00:30 GMT

Telangana Formation Day: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

Telangana Formation Day: తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిన రోజు ఇది. అవమానాలు, అసమానతలు రూపుమాపాలంటూ నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుని ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయం గన్ పార్క్ దగ్గర ముఖ్యమంత్రి అమరవీరులకు నివాళులు అర్పించనుండగా జిల్లాల్లో మంత్రులు జెండా ఆవిష్కరించనున్నారు. అయితే ఈ ఏడాది వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నాయి. ఏటా అవతరణ దినోత్సవం అంటే ఓ పండగలా జరిపే వేడుకలపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఫార్మేషన్‌ డేను నిరాడంబరంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

కరోనా నేపథ్యంలో అవతరణ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ఏడాది అన్ని కార్యక్రమాలు రద్దు చేసి కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించాలని తెలిపింది. జెండా వందనం సందర్భంగా 12 మంది పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించాలని సూచించింది ప్రభుత్వం. వేదిక వద్ద పది మంది మాత్రమే ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని నిర్దేశించింది. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రసంగాలు, పురస్కారాలు, ఆస్తుల పంపిణీ ఉండరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనుండగా జిల్లా కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు మంత్రులు, ప్రముఖులు పతాకావిష్కరణ చేయనున్నారు. ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏటా ప్రజలకు కొత్త కానుక ఆనవాయితీగా వస్తుండగా ఈ ఏడాది వేడుకల్లో ఉద్యోగ కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రకటన ఉంటుందని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News