హైదరాబాద్‌లో ఇవాళ 3వ రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
Hyderabad: మొదటిరోజు పొలిటికల్ పార్టీలతో సమావేశమైన కేంద్ర బృందం
హైదరాబాద్‌లో ఇవాళ 3వ రోజు కేంద్ర ఎన్నికల బృందం పర్యటన
Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ కేంద్ర ఎన్నికల బృందం మూడవ రోజు పర్యటన కొనసాగనుంది. మొదటి రోజు రాజకీయ పార్టీలతో సమావేశమైన ఈసీ.. రెండవ రోజు కలెక్టర్‌లు, సీపీలు, ఎస్పీలతో సమావేశం నిర్వహించింది. ఇక లాస్ట్ డే టూర్‌లో భాగంగా ఇవాళ యువత, దివ్యాంగ ఓటర్లతో సమావేశంకానున్నారు. ఉదయం 11 గంటలకు చీఫ్ సెక్రటరీ, డీజీపీతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నారు కేంద్ర ఎన్నికల బృందం అధికారులు. ఇక కేంద్ర బృందం ఢిల్లీ వెళ్లిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక ఓటర్ అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ఓటింగ్ శాతం పెంచేందుకు చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలపై ఈసీ ఫోకస్ పెట్టనుంది. ఓటర్ల లిస్టులో అవకతవకలపై కేంద్ర ఎన్నికల బృందానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇక కంప్లయింట్‌లపై ఫోకస్ పెట్టిన ఈసీ.. ఆయా అధికారుల నుంచి వివరాలు సేకరించింది. ఎన్నికల్లో డబ్బు, అక్రమ మద్యం రవాణాపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కలెక్టర్‌లు, సీపీలు, జిల్లా ఎస్పీలను ఆదేశించింది ఈసీ. అంతర్రాష్ట్ర సరిహద్దులో నిఘా పెంచాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయా సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించింది.
హవాలా నగదు, ఇతర లావాదేవీలపై ఐటీ శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక దృష్టిసారించాలని సూచించింది. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా సోషల్‌మీడియా, ఇతర మాధ్యమాలపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించింది ఈసీ. సాధ్యమైనంత మేరకే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.