Gandhi Bhavan: గాంధీభవన్‌లో మ.3 గంటలకు టీకాంగ్రెస్ అత్యవసర సమావేశం.. హాజరుకానున్న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ థాక్రే, భట్టి
Gandhi Bhavan: తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణపై చర్చ
Gandhi Bhavan: గాంధీభవన్‌లో మ.3 గంటలకు టీకాంగ్రెస్ అత్యవసర సమావేశం.. హాజరుకానున్న ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ థాక్రే, భట్టి
Gandhi Bhavan: గాంధీభవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు టీకాంగ్రెస్ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ థాక్రేతో పాటు.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ, చేవెళ్ల బహిరంగ సభ, గద్వాల్ సభలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే.. తిరగబడదాం-తరిమికొడదాం కార్యక్రమంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక.. ఎన్నికలకు సమాయత్తంపై నేతలకు పీసీసీ దిశానిర్దేశం చేయనుంది.