Telangana Local Body Elections: ఉద్యోగం వదిలి.. ఎన్నికల బరిలోకి..
Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి.
Telangana Local Body Elections: ఉద్యోగం వదిలి.. ఎన్నికల బరిలోకి..
Telangana Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం ఆశా వర్కర్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. మూడో విడతలో నామినేషన్ దాఖలు చేసింది ఓ మహిళ. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలంలోని చిక్కెపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి పోటీ చేసేందుకు.. ఓ ఆశా కార్యకర్త తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. చిక్కెపల్లి గ్రామానికి చెందిన పార్వతి అనే మహిళ.. పదేళ్లుగా ఆశా వర్కర్‌గా పనిచేస్తోంది.
అయితే.. చిక్కెపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో.. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌కు లేఖను అందించింది. రాజీనామాను DMHO కూడా అంగీకరించడంతో ఆ మహిళ బాధగా కన్నీరు పెడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసింది. అయితే.. కన్నీరు పెడుతున్న పార్వతిని.. తోటి మహిళలు ఓదార్చారు. తనకు అండగా ఉంటామని, గెలిపించి న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారు. పార్వతి బీఆర్‌ఎస్, బీజేపీ మద్దతుతో నామినేషన్ దాఖలు చేసింది.