Telangana Rising Global Summit: 100 ఎకరాల్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ముహూర్తం ఫిక్స్

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ అజెండాను అధికారులు ఖరారు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతున్న ఈ ఆర్థిక సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

Update: 2025-12-06 09:45 GMT

ఈ రెండు రోజుల సమ్మిట్‌లో మొత్తం 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ–విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు, క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

సదస్సు రెండో రోజు సాయంత్రం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించనున్నారు. అలాగే, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్ను ప్రభుత్వం వెల్లడించనుంది.

ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్‌లో పీవీ సింధు, అనిల్ కుంబ్లే, పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, గుత్తా జ్వాల పాల్గొనగా, క్రియేటివ్ సెషన్‌లో దర్శకులు రాజమౌళి, సుకుమార్, నటుడు రితేష్ దేశ్‌ముఖ్, గుణీత్ మోంగా, అనుపమ చోప్రా పాల్గొననున్నారు.

Tags:    

Similar News