Hanamkonda: సుబేదారిలోని హోటళ్లపై పోలీసుల సోదాలు... సోదాల్లో బయటపడ్డ 50కి పైగా డొమెస్టిక్ సిలిండర్లు!

Hanamkonda: హన్మకొండ జిల్లాలో డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగంపై అధికారుల మెరుపు దాడులు. 50 సిలిండర్లు స్వాధీనం, నిబంధనలు అతిక్రమిస్తే హోటళ్లు సీజ్ చేస్తామని డీఎస్ఓ వాజీద్ అలీ హెచ్చరిక.

Update: 2026-03-19 07:29 GMT

Hanamkonda: సుబేదారిలోని హోటళ్లపై పోలీసుల సోదాలు... సోదాల్లో బయటపడ్డ 50కి పైగా డొమెస్టిక్ సిలిండర్లు!

హన్మకొండ: జిల్లాలో గృహ అవసరాలకు ఉపయోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తున్న వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గృహ సిలిండర్లను వాడుతున్న హోటళ్లు, రెస్టారెంట్లపై జిల్లా పౌర సరఫరాల శాఖ మరియు సుబేదారి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.

నిబంధనలు అతిక్రమిస్తే హోటళ్లు సీజ్!

ఈ దాడుల్లో భాగంగా సుమారు 50కి పైగా డొమెస్టిక్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి (DSO) వాజీద్ అలీ మాట్లాడుతూ.. తక్కువ ధరకు వచ్చే గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు కేవలం కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వాడాలని సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించి గృహ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే కేసులు నమోదు చేసి హోటళ్లను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.

Tags:    

Similar News