Hanamkonda: జిల్లా కలెక్టర్ ఆఫీస్‌లో కుక్కలు స్వైర విహారం
Hanamkonda: హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.
Hanamkonda: హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శునకాలు హాయిగా సేదతీరుతున్న దృశ్యాలు చూసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. దీంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలోకే కుక్కలు దర్జాగా వస్తుంటే.. సాధారణ పట్టణాలు, గ్రామాల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్నాయని, చిన్నారులు, పెద్దలపైనే కాకుండా మేకలు, కోళ్ళు లాంటి అనేక జంతువులపై క్రూరంగా దాడి చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈమధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం తెలంగాణలో కూడా కుక్కలను పట్టణాలు, గ్రామాలలో తిరుగనివ్వకుండా నివాసిత ప్రాంతాలకు తరలించాలని ప్రజలు కోరుకుంటున్నారు.