Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం
Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది.
Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం
Panchayat Elections: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని రణవెల్లి సర్పంచ్ అభ్యర్థి జాడి దర్శనను బెదరిస్తూ దళం పేరిట లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించారని బాధితుడి మామ ఫిర్యాదు పోలీసులను ఆశ్రయించాడు. ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తి.. తుపాకీతో బెదిరించినట్టు బాధితుడు కంప్లయింట్ ఇచ్చాడు. రణవెల్లిలో నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని బెదిరించినట్టు తెలిపాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇచ్చినట్టు బాధితుడు స్పష్టం చేశాడు.