Hyderabad: వనస్థలిపురం పీఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం
Hyderabad: ప్రగతినగర్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం * రమేష్ అతని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశారంటున్న బాధితులు
Representational Image
Hyderabad: హైదరాబాద్ వనస్థలిపురం పీఎస్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. ప్రగతినగర్‌లో ముగ్గురు మైనర్ బాలికలను కిడ్నాప్ చేశారు దుండగులు. అయితే రమేష్ అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. గతంలో రమేష్ ప్రేమిస్తున్నానంటూ తమ బాలిక వెంటపడ్డట్లు బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.