Gangula Kamalakar: తెలంగాణను మళ్లీ ఏపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది
Gangula Kamalakar: ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీ కలుస్తున్నాయి
Gangula Kamalaker: తెలంగాణను మళ్లీ ఏపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోంది
Gangula Kamalakar: తెలంగాణను మళ్లీ ఏపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణను మళ్లీ ఢిల్లీ పాలకుల చేతిలో పెట్టొద్దంటూ ప్రజలను కోరారు. అలా జరిగితే తెలంగాణ మళ్లీ అంధకారంలోకి వెళ్లే ప్రమాదముందని మాట్లాడారు. కేసీఆర్ ను ఓడించేందుకు ఢిల్లీలో కాంగ్రెస్, బీజేపీలు కలిసే పని చేస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికే 40 ఏళ్ల పాటు నరకం అనుభవించామన్నారు. తెలంగాణ వ్యతిరేకులందరూ ఢిల్లీలో కూర్చుని ప్రణాళికలు చేస్తున్నారని ఆరోపించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఢిల్లీ చేతికి ఇవ్వొద్దని అన్నారు.