Rains: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం..

Rains: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్

Update: 2023-07-31 11:54 GMT

Rains: హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. 

Rains: హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. రెండు రోజులు కాస్త విరామం ఇచ్చిన మేఘాలు నగరాన్ని మళ్లీ కమ్మేశాయి. దీంతో భాగ్య నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌,మల్కాజ్‌గిరితో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో..ఐటీ కారిడార్‌‌లో భారీగా ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇటు వాహనదారులు..అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరోవైపు.. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది వాతావరణశాఖ. హైదరాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లికి ఎల్లో అలర్ట్‌ చేశారు. ఇటు.. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వరంగల్‌, హన్మకొండ, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డికి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు ఉదయం వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ.. గంటకు 40-50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Tags:    

Similar News