Telangana: ఫామ్ హౌజ్ కేసులో నిందితుల రిమాండ్ పిటిషన్ తిరస్కరణ
Telangana: 41సీఆర్పీసీ ఇచ్చి విచారించాలని జడ్జి సూచన
ఫామ్ హౌజ్ కేసులో నిందితుల రిమాండ్ పిటిషన్ తిరస్కరణ
Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిన్న రాత్రి మొయినాబాద్ ఫామ్ హౌజ్ వేదికగా జరిగిన పరిణామాలతో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, ఇవాళ ఏసీబీ కోర్టు జడ్జినివాసంలో హాజరు పరిచారు. కేసును పరిశీలించిన జడ్జి వాదోపవాదాలు విన్నారు. పోలీసుల రిమాండ్ పిటిషన్‌ను జడ్జి తిరస్కరించారు. కేసుకుసంబంధించి సరైన ఆధారాలు లేవని నిందితుల రిమాండ్ పిటిషన్‌ను తిరస్కరించారు.