Telangana: తెలంగాణకు బిగ్ రిలీఫ్

Telangana: తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీరనుంది. మృత్యువుతో పోరాడుతోన్న కోవిడ్ పేషంట్ల ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రాణవాయువు హైదరాబాద్‌ చేరుకుంది.

Update: 2021-04-27 09:20 GMT

Telangana: తెలంగాణకు బిగ్ రిలీఫ్

Telangana: తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీరనుంది. మృత్యువుతో పోరాడుతోన్న కోవిడ్ పేషంట్ల ప్రాణాలు నిలబెట్టేందుకు ప్రాణవాయువు హైదరాబాద్‌ చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్యాంకర్లలో 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను రవాణా శాఖ రాజధాని నగరానికి చేరవేసింది. ఇవాళ మరో ఎనిమిది ట్యాంకులను ఒడిశాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ప్రాణవాయువు కొరతతో అల్లాడుతున్న తెలంగాణకు ఆ టెన్షన్ నుంచి ఉపశమనం లభించింది. ఒడిశా నుంచి సోమవారం 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ హైదరాబాద్ చేరుకుంది. ఇటీవల బేగంపేట్ విమానాశ్రయం నుంచి ట్యాంకర్లు పంపిన ప్రభుత్వం 150 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తీసుకొచ్చింది. రవాణా శాఖ సమకూర్చిన ఈ ట్యాంకర్లను ఆర్టీసీ డ్రైవర్లు హైదరాబాద్‌కు చేరవేశారు.

తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కేంద్రం ఒడిశా నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవాలని సూచించింది. ఇందుకు అంగుల్, రూర్కెలా స్టీల్ ప్లాంట్లు కేటాయించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల యుద్ధవిమానాల సహకారంతో ట్యాంకర్లను తరలించింది. 9 ట్యాంకర్లను పంపగా మొదటి విడతలో 5 ట్యాంకర్లు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఈ ట్యాంకర్లను హైదరాబాద్ నుంచి అవసరం మేరకు జిల్లాలకు పంపనున్నారు. తొలివిడతలో చేరుకున్న వాటిలో రెండు ట్యాంకర్లను టిమ్స్‌, కింగ్ కోటి హాస్పిటల్స్‌కు తరలించారు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటళ్ల వినియోగానికి ఒక ట్యాంకర్ ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు ఒక్కో ట్యాంకర్‌ను పంపనున్నారు.

మొత్తానికి ఆక్సిజన్ కొరతతో కొట్టుమిట్టాడుతోన్న రోగులకు ఆక్సిజన్ ట్యాంకర్లు రావడం కాస్త రిలీఫ్‌ ఇస్తోంది. అయితే భవిష్యత్‌లో ఆక్సిజన్‌ అవసరమయ్యే అవకాశాలు ఉండటంతో ఎయిర్ ఫోర్స్ సాయంతో మరిన్ని లిక్విడ్ ట్యాంకర్లను తెప్పించేందుకు కృషి చేస్తోంది. 

Tags:    

Similar News