Telangana Budget: నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
Telangana Budget: ఎన్నికల బడ్జెట్ కావడంతో సంక్షేమంపైనే ప్రత్యేక దృష్టి
Telangana Budget: నేడు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
Telangana Budget: 2023-24 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్‌ను నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 10.30 గంటలకు శాసనసభలో మంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 2.9 లక్షల కోట్ల వరకు అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 2022- 23కు రూ.2.56 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆ మొత్తానికంటే ఎక్కువగా 2.9 లక్షల కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించనుందని సమాచారం.
ఇక ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ ప్రజారంజక బడ్జెట్ పెట్టే కసరత్తు పూర్తయింది. సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ పెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు మంత్రి హరీశ్‌రావు శాసనసభలో 2023- 24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత శాసనమండలిలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు. గత కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్ మార్కుతో అమలవుతోన్న సంక్షేమ పథకాలన్నీ ఎన్నికల ఏడాదిలో యథాతథంగా కొనసాగేలా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ పథకాలకు తోడు విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, మన ఊరు- మన బడి లాంటి పథకాలకు ప్రత్యేక కేటాయింపులు ఈ బడ్జెట్‌లో ఉండనున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు సాగునీటి రంగానికి కూడా ఈసారి భారీ బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ 20 రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ శాఖలకు సంబంధించి గత కేటాయింపులు, చేసిన వ్యయం తదితర అంశాలపై సమీక్షించారు. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేపట్టేబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు.