Durgam Cheruvu Cable Bridge: ఆహా అనిపిస్తున్న 'కేబుల్ బ్రిడ్జి'

Durgam Cheruvu Cable Bridge హైదరాబాద్ నగరంలో అద్భుతమైన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.

Update: 2020-09-02 06:57 GMT

Durgam Cheruvu Cable Bridge హైదరాబాద్ నగరంలో అద్భుతమైన కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్ నగరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న నగరానికి ఈ కొత్త నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి. ప్రపంచంలోని పెద్ద కేబుల్ వంతెనలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ బ్రిడ్జి రాకతో దుర్గం చెరువు ప్రాంతం పర్యటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.

ఈ కేబుల్ వంతెన ప్రారంభించడం ద్వారా చాలా మంది ప్రయాణికులకు కొన్ని కిలో మీటర్ల దూరం ప్రయాణ భారం తగ్గుతుంది. అంతే కాదు శని, ఆదివారాల్లో ఈ కేబుల్ వంతెన పైకి వాహనాలు అనుమతి చేయకుండా కేవలం సందర్శనకు మాత్రమే అనుమతులు ఇవ్వనున్నారు అధికారులు. ఈ కేబుల్ వంతెనను సందర్శనకు వచ్చిన వారి వాహనాలు పార్కింగ్ చేయడానికి కూడా స్థలాన్ని ఏర్పాటు చేసారు.

అయితే, దుర్గం చెరువు నిర్మాణ పనులు త్వరలోనే కానుండగా.. ఈ వంతెన అందాలు నగర వాసులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా రాత్రి వేళల్లో ఈ కేబుల్ బ్రిడ్జి అందాలకు సంబంధించిన వీడియో ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో షేర్ చేసారు. ఈ సందర్భంగా ఈ బ్రిడ్జి ఇంజనీరింగ్ టీం ను అయన అభినందించారు. విధ్యుత్ కాంతుల్లో ఈ బ్రిడ్జి వెలిగిపోతూ చూపరులను 'అదరహో' అనిపిస్తుంది.


 

Tags:    

Similar News