Breaking News: తెలంగాణలో విద్యాసంస్థలు మూసివేత

Breaking News: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2021-03-23 11:41 GMT

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థలు మూసివేత

Breaking News: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల మూసివేతకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ర్ట వ్యాప్తంగా సెల‌వులు ప్ర‌క‌టిస్తూ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌ట‌న చేశారు. పాఠ‌శాల‌ల్లో క‌రోనా పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో మంత్రి స‌బిత‌, విద్యా‌, వైద్యారోగ్య శాఖ‌ అధికారుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశ‌మై చ‌ర్చించారు. పాఠ‌శాల‌ల‌కు సెల‌వులు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖ సూచించింది. స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీల్లో భారీగా కరోనా కేసులు నమోదవడం పెద్దఎత్తున టీచర్లు, విద్యార్ధులు, సిబ్బంది వైరస్ బారిన పడటంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే, విద్యాసంస్థల మూసివేత నుంచి మెడికల్ కాలేజీలకు మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News