Telangana: కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana: అన్ని జల విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతించాలని వినతి

Update: 2021-07-29 08:43 GMT

కృష్ణ రివర్ మనగెమెంత్ బోర్డు (ఫైల్ ఇమేజ్)

Telangana: కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. కృష్ణాలో వరద కారణంగా అన్ని జల విద్యుత్ కేంద్రాల నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనుమతించాలని కేఆర్‌ఎంబీని కోరింది టీ సర్కార్‌. ఏపీ ప్రభుత్వం జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ చేసిన 8వందల 11 టీఎంసీలు గంపగుత్త కేటాయింపులంది తెలంగాణ ప్రభుత్వం. 2021-22 ఏడాదికి గాను 50:50 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని కోరింది. బేసిన్‌లో ఉండే ప్రాంతాల అవసరాలు తీరిన తర్వాతే.. బేసిన్‌ అవతలి ప్రాంతాలకు నీటిని తరలించడానికి అనుమతించాలని కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పేర్కొంది తెలంగాణ సర్కార్. ‎

Full View


Tags:    

Similar News