ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం..
Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది.
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం..
Cabinet Meeting: తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లకు పైగా ఉండే అవకాశముంది. గత ఏడాది రూ.2 లక్షల 30వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.