Bandi Sanjay: కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా..? లేదా చెప్పాలి..
Bandi Sanjay: కేబినెట్ సమావేశంలో 317జీవోపై ఎందుకు చర్చ జరపలేదని ప్రశ్నించారు టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్.
Bandi Sanjay: కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా..? లేదా చెప్పాలి..
Bandi Sanjay: కేబినెట్ సమావేశంలో 317జీవోపై ఎందుకు చర్చ జరపలేదని ప్రశ్నించారు టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్. 317జీవో సవరించే వరకు పోరాటం ఆపమన్నారు ఆయన. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ వ్యాక్సిన్ తీసుకున్నారా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. 2023లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కేసీఆర్ జాతకం బాగాలేదని చెప్పారు. కార్పొరేట్ పాఠశాల నుంచి డబ్బులు దండుకోవటం కోసమే ఇంగ్లిషు మీడియం అంటున్నారన్నారు.
ప్రధాని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని, ఉద్యోగులెవ్వరూ భయపడాల్సినవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులకు మద్దతుగా బీజేపీ పోరాటం చేస్తుందని.. జాగరణ దీక్ష ఘటనలో ఇంకా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.