TS Assembly 2021: మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి అసెంబ్లీ సమావేశాలు

TS Assembly Sessions 2021: ఇవాళ ఆరు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

Update: 2021-10-01 04:28 GMT

అసెంబ్లీ (ఫైల్ ఫోటో)

TS Assembly Sessions 2021: మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ తిరిగి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టనుంది. తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021 ను సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రవేశపెట్టనున్నారు.

తెలంగాణ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ.. తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021 ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్శిటీ సవరణ బిల్లును మంత్రి నిరంజన్ రెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టనున్నారు.

ప్రశ్నోత్తరాల సమయం తర్వాత శాసనమండలిలో తెలంగాణలో ఐటీ, పరిశ్రమల అభివృద్ధిపై చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. శాసన సభలో ప్రశ్నోత్తరాల తర్వాత హరితహారంపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 5వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ, సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని సెప్టెంబరు 24న జరిగిన బీఏసీ సమావేశంలో విపక్షాలు డిమాండ్ చేశారు.. ఈ నేపథ్యంలో 5న శాసనసభ వాయిదా పడగానే బీఏసీ భేటీ అయి, సమావేశాల గడువును పెంచే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News