ATM: కాసుల వర్షం.. వెయ్యి రూపాయలు డ్రా చేస్తే రెండు వేల నోటు..
ATM: సాంకేతిక లోపం కారణంగా సిద్దిపేట జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో కాసుల వర్షం కురిసింది.
ATM: కాసుల వర్షం.. వెయ్యి రూపాయలు డ్రా చేస్తే రెండు వేల నోటు..
ATM: సాంకేతిక లోపం కారణంగా సిద్దిపేట జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో కాసుల వర్షం కురిసింది. ఏటీఎంలో వెయ్యి రూపాయలు డ్రా చేస్తే రెండు వేల రూపాయుల నగదు వచ్చాయి. దీంతో ఒక్క సారిగా షాక్ కు గురైన ఖాతాదారులు పెద్ద ఎత్తున ఏటీఎంకు క్యూ కట్టారు. అయితే ఈ విషయం కాస్త ఆ నోట, ఈ నోట విని బ్యాంకు అధికారులకు సమాచారం అందింది. అప్పటికే చాలా మంది డబ్బులు విత్‌డ్రా కూడా చేసుకున్నారు. దీంతో వెంటనే ఏటీఎం వద్దకు చేరుకున్న అధికారులు ఏటీఎంను మూసేశారు.