Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో సిబ్బంది నిర్వాకం.. విద్యార్థుల పుస్తకాలు సెల్లార్ గదిలో పడేసిన సిబ్బంది
Basara IIIT: విద్యార్థుల పుస్తకాలు సెల్లార్ గదిలో పడేసిన సిబ్బంది
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో సిబ్బంది నిర్వాకం.. విద్యార్థుల పుస్తకాలు సెల్లార్ గదిలో పడేసిన సిబ్బంది
Basara IIIT: బాసర R.G.K.Tలో మరో వివాదం నెలకొంది. వేసవి సెలవు కావడంతో విద్యార్థులు ఇంటికెళ్లారు. అయితే పీయూసీ 2 విద్యార్థుల పరీక్షలు పూర్తి కాకమేందు హాస్టల్‌ను యాజమాన్యం ఖాళీ చేసింది. విద్యార్థులకు చెందిన బుక్స్, కాస్మెటిక్స్, డ్రెస్సులు, ఒరిజనల్ సర్టిఫికెట్లు సెల్లార్ గదిలో పడేశారు. ఈనెల 7నుంచి సెకండ్ సెమ్ ఉండటంతో విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి చేరుకుంటున్నారు. విద్యార్థులు హాస్టల్ కు వెళ్లే సరికి వారి వస్తువులు , బుక్స్ లేకపోవడంతో వెతకగా ఓ చోట పడేసి కనిపించాయి. కొద్ది రోజుల్లో సెకండ్ సెమ్ ఉండగా... బుక్స్ లేకపోవడంతో ఎలా ప్రిపేర్ కావాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
అయితే దీనిపై వర్సిటీ సిబ్బంది వాదన మరోలా ఉంది. విద్యార్థులు తమ వస్తువులను తీసుకెళ్లాలని వర్సిటీ చీఫ్ వార్డెన్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. తమకు పనికి రాని వస్తువులను విద్యార్థులు వదిలి వెళ్లారని అంటున్నారు. గదులను శుభ్రం చేయడం, లైట్, ఫ్యాన్, స్విచ్ బోర్డ్స్ పనితీరును పరిశీలిస్తామని చెబుతున్నారు. విలువైన వస్తువులను గుర్తిస్తే ప్రత్యేక గదిలో భద్రపరామని సిబ్బంది తెలిపారు. విద్యార్థులు నిరాధారమైన ఆరోపణలు చేయడం తగదంటున్నారు.