తెలుగుతేజాలు హంపి, అర్జున్‌లకు సీఎం చంద్రబాబు అభినందనలు
దోహాలో జరిగిన అంతర్జాతీయ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించి, భారత దేశానికి, ప్రత్యేకించి తెలుగు వారికి గర్వకారణంగా నిలిచిన మన తెలుగు తేజాలు, గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అమరావతి: దోహాలో జరిగిన అంతర్జాతీయ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించి, భారత దేశానికి, ప్రత్యేకించి తెలుగు వారికి గర్వకారణంగా నిలిచిన మన తెలుగు తేజాలు, గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, అర్జున్ ఇరిగేసిలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
తెలుగు గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ఇరిగేసి అర్జున్ అసమాన పోరాటంతో పతకాలు కొల్లగొట్టారు. ఆదివారం ముగిసిన ర్యాపిడ్ పోటీల్లో ఈ ఇరువురు టైటిల్‌కు చేరువగా వచ్చినా, చివరకు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. వరల్డ్ నెంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ ఓపెన్ విభాగంలో ఆరోసారి ర్యాపిడ్ టైటిల్‌ను ఖాతాలో వేసుకోగా, మహిళల కేటగిరీలో రష్యా జీఎం అలెక్సాండ్రా గోర్యాచ్కినా విజేతగా నిలిచింది.
ఓపెన్ విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన భారతీయుడుగా అర్జున్ రికార్డుకెక్కడం విశేషం అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ పుత్రుడైన అర్జున్ భారతదేశ విశిష్ట చెస్ వారసత్వానికి మరో గర్వకారణమైన అధ్యాయాన్ని జోడించాడన్నారు.
కోనేరు హంపిని అభినందనందిస్తూ, విజేతలను ఒక్క ఫలితం నిర్వచించదు, అత్యున్నత స్థాయిలో పదే పదే పోటీపడే ధైర్యం నిర్వచిస్తుందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ వేదికపై సాధించిన కాంస్య పతకం నిజమైన శ్రేష్ఠతను ప్రతిబింబిస్తుందన్నారు. మీ ప్రయాణం, మీరు భారతదేశానికి తీసుకువస్తున్న గౌరవం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.