IPL vs PSL: ఆదాయం, బ్రాండ్ విలువలో భారీ తేడా.. ఈ గణాంకాలు చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
IPL vs PSL: క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మధ్య పోలికలు ఎప్పుడూ సోషల్ మీడియా, మాజీల మధ్య చర్చనీయాంశంగానే ఉంటాయి.
IPL vs PSL: ఆదాయం, బ్రాండ్ విలువలో భారీ తేడా.. ఈ గణాంకాలు చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
IPL vs PSL: క్రికెట్ ప్రపంచంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మధ్య పోలికలు ఎప్పుడూ సోషల్ మీడియా, మాజీల మధ్య చర్చనీయాంశంగానే ఉంటాయి. ఐపీఎల్ టోర్నీకి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మాత్రం పాకిస్థాన్ మాజీలు, ఫాన్స్ అస్సలు ఒప్పుకోరు. పీఎస్ఎల్ టోర్నీకి కూడా ఫుల్ క్రేజ్ ఉందని డబ్బా కొట్టుకుంటారు. అయితే తాజాగా బయటకు వచ్చిన గణాంకాలు.. పీఎస్ఎల్, ఐపీఎల్ లీగ్‌ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా జట్టు పర్స్, ఆటగాళ్ల జీతాలు, బ్రాండ్ విలువ, మ్యాచ్ ఆదాయాలు వంటి అంశాల్లో ఐపీఎల్ ఎన్నో రెట్లు ముందంజలో ఉంది.
టీమ్ పర్స్:
పీఎస్ఎల్‌లో ఒక జట్టు మొత్తం పర్స్ సుమారు రూ.14.60 కోట్లు మాత్రమే ఉండగా.. ఐపీఎల్‌లో ఓ టీమ్ పర్స్ వాల్యూ ఏకంగా రూ.120 కోట్లు. ఐపీఎల్‌లో రిషభ్ పంత్ ఒకడే రూ.27 కోట్ల పారితోషికం పొందుతున్నాడు. అంటే పీఎస్ఎల్ జట్టు మొత్తం బడ్జెట్ కంటే.. ఒక ఐపీఎల్ స్టార్ ఆటగాడి జీతమే ఎక్కువగా ఉండటం ఆసక్తికర విషయం.
బ్రాండ్ వాల్యూ:
బ్రాండ్ విలువ విషయానికి వస్తే.. తేడా మరింత భారీగా కనిపిస్తోంది. పీఎస్ఎల్ మొత్తం బ్రాండ్ విలువ సుమారు రూ.1,675 కోట్లు. ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ.1,56,568 కోట్లుగా అంచనా. అంటే ఐపీఎల్ బ్రాండ్ విలువ పీఎస్ఎల్ కంటే దాదాపు 90కి పైగా రెట్లు ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.
మ్యాచ్ ఆదాయం:
మ్యాచ్ ఆదాయాల్లో కూడా ఐపీఎల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ నుంచే సుమారు రూ.118 కోట్లు ఆదాయం వస్తుంటే,.. పీఎస్ఎల్ మొత్తం సీజన్ ఆదాయం సుమారు రూ.300 కోట్లుగా ఉంది. అంటే ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌ల ఆదాయం పీఎస్ఎల్ మొత్తం సీజన్ సంపాదనతో సమానంగా ఉండటం విశేషం.
ఫైనల్లీ:
ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా ఎందుకు నిలిచిందో స్పష్టంగా అర్థమవుతోంది. భారీ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మద్దతు వంటి అంశాలు ఐపీఎల్‌ను ఇతర లీగ్‌లతో పోల్చితే చాలా ముందంజలో నిలిపాయి.