Mitchell Marsh Injury: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు అక్కడ గాయం, ఇక డౌటే!

టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు.

Update: 2026-02-11 12:17 GMT

Mitchell Marsh Injury: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు అక్కడ గాయం, ఇక డౌటే!

టీ20 వరల్డ్‌కప్ 2026 ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ గాయంతో తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఐర్లాండ్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా అతడికి గాయమైంది. బంతి బలంగా తగలడంతో మార్ష్ వృషణాల్లో అంతర్గత రక్తస్రావం జరిగినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుతం అతను తీవ్రమైన నొప్పి, అసౌకర్యంతో బాధపడుతున్నాడని తెలిపింది. ప్రస్తుతం మార్ష్ నడవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడని.. పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని వైద్యులు సూచించారని సీఏ పేర్కొంది. మెగా టోర్నీలో ఇక మార్ష్ ఆడడం అనుమానమే అని తెలుస్తోంది.

మిచెల్ మార్ష్ స్థానంలో స్టాండ్‌బై ప్లేయర్‌గా స్టీవ్ స్మిత్‌ శ్రీలంకకు పయనం కానున్నాడు. టీ20 వరల్డ్‌కప్ 2026కు స్మిత్ ఎంపిక కాని విషయం తెలిసిందే. అతడికి మొదటిసారి జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్‌లో స్మిత్ అద్భుత ప్రదర్శన తర్వాత కూడా క్రికెట్ ఆస్ట్రేలియా అతడిని ఎంపిక చేయలేదు. ఇప్పటికే ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ వంటి కీలక ఆటగాళ్లు గైర్హాజరైన నేపథ్యంలో మార్ష్ గాయం జట్టుకు మరింత ఆందోళన కలిగిస్తోంది. అయినా కూడా ఆసీస్ పటిష్టంగానే ఉంది.

ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడుతోంది. అనంతరం ఫిబ్రవరి 13న జింబాబ్వే, ఫిబ్రవరి 16న శ్రీలంక, ఫిబ్రవరి 20న ఒమాన్‌తో గ్రూప్ దశ మ్యాచ్‌లు ఆడనుంది. మిచెల్ మార్ష్ త్వరగా కోలుకుని తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. మార్ష్ స్థానంలో ట్రావిస్ హెడ్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఐర్లాండ్పై ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. మార్కస్ స్టాయినిస్ (45; 29 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. జోష్‌ ఇంగ్లిస్ (37), రెన్ షా (37) రాణించారు. కామెరూన్ గ్రీన్ 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లతో 21 రన్స్ చేశాడు. స్టార్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్ (6), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (9) విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్ 2 వికెట్స్ పడగొట్టగా.. మాథ్యూ హంఫ్రీస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టర్ తలో వికెట్ తీశారు.

Tags:    

Similar News