MI vs KKR: దంచికొట్టిన రహానె, రఘువంశీ.. ముంబై ఇండియన్స్ ముందు 200 ప్లస్ టార్గెట్!

MI vs KKR IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) బ్యాటింగ్ ముగిసింది.

Update: 2026-03-29 17:30 GMT

MI vs KKR: దంచికొట్టిన రహానె, రఘువంశీ.. ముంబై ఇండియన్స్ ముందు 200 ప్లస్ టార్గెట్!

MI vs KKR IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) బ్యాటింగ్ ముగిసింది. కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 రన్స్ చేసింది. దాంతో ముంబై ముందు 221 టార్గెట్ ఉంది. కోల్‌కతా బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానె, వికెట్ కీపర్ అంక్రిష్ రఘువంశీలు దంచి కొట్టారు. రహానె 40 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 67 రన్స్ చేశాడు. రఘువంశీ 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 51 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరలో హిట్టర్ రింకు సింగ్‌ 21 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3 వికెట్స్ పడగొట్టగా.. హార్దిక్ పాండ్య ఒక వికెట్ తీశాడు.

సొంత మైదానంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు అజింక్యా రహానే, ఫిన్ అలెన్ (37)లు మంచి ఆరంభం ఇచ్చారు. అలెన్ బౌండరీల మోత మోగించాడు. బౌండరీలతో విరుచుకుపడడంతో కేకేఆర్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. రహానే కూడా దూకుడుగా ఆడడంతో కోల్‌కతా ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. అలెన్ ఔటైనా.. జింక్స్ రెచ్చిపోయాడు. స్టార్ ఆటగాడు కామెరూన్‌ గ్రీన్‌ (18) నిరాశపర్చాడు.

రహానెకు రఘువంశీ తోడవ్వడంతో కేకేఆర్ రన్ రేట్ 10కి పైగా సాగింది. ఈ క్రమంలో జింక్స్ 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్ధ శతకంతో రెచ్చిపోయిన రహానెకు రఘువంశీ (51) మెరుపులు తోడవ్వగా ముంబై బౌలర్లు డీలా పడ్డారు. ముంబైకి శార్దూల్‌ బ్రేక్ ఇచ్చాడు. రహానె (67) హార్దిక్‌పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. లైఫ్ లభించిన రఘువంశీ.. ఫిఫ్టీ బాదాడు. 28 బంతుల్లో హాఫ్‌సెంచరీ నమోదు చేసుకున్న రఘువంశీ పెవిలియన్ చేరినా.. రింకు సింగ్‌ రెచ్చిపోయాడు. చివరి ఓవర్లో బుమ్రా 11 పరుగులిచ్చాడు. కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది.

Tags:    

Similar News