CSK-MS Dhoni: షాకింగ్ స్టాట్స్.. ఎంఎస్ ధోనీ లేకుంటే సీఎస్‌కేకు ఓటములే!

CSK-MS Dhoni: 2008 నుంచి 2026 వరకు ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇన్నేళ్లలో ధోనీ లేకుండా సీఎస్‌కే చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడింది.

Update: 2026-03-30 14:44 GMT

CSK-MS Dhoni: షాకింగ్ స్టాట్స్.. ఎంఎస్ ధోనీ లేకుంటే సీఎస్‌కేకు ఓటములే!

CSK-MS Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనీ ఎంత ముఖ్యమైన ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్‌గా, ఫినిషర్‌గా, వికెట్‌ కీపర్‌గా ధోనీ జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. మహీ సారథ్యంలో సీఎస్‌కే ఏకంగా ఐదు టైటిల్స్ గెలుచుకుంది. అయితే గాయం కారణంగా ధోనీ ఐపీఎల్ 2026లో మొదటి రెండు వారాల ఆటకు దూరమయ్యాడు. ఈరోజు రాజస్థాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ధోనీ ఆడడం లేదు. ధోనీ లేకుండా సీఎస్‌కే ఆడిన మ్యాచ్‌లలో ఓటములనే ఎదుర్కొంది. ఆ రికార్డు చూస్తే.. సీఎస్‌కే ఎంతగా అతనిపై ఆధారపడుతుందో స్పష్టంగా తెలుస్తుంది.

2008 నుంచి 2026 వరకు ఎంఎస్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇన్నేళ్లలో ధోనీ లేకుండా సీఎస్‌కే చాలా తక్కువ మ్యాచ్‌లే ఆడింది. కానీ ఆ మ్యాచ్‌లలో ఎక్కువగా ఓటములే ఎదురయ్యాయి. ధోనీ లేకుండా 2010లో ఢిల్లీపై సీఎస్‌కే ఆడింది. ఆ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది. అనంతరం ఆడిన మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. 2010లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై, 2010లో ఆర్సీబీపై, 2019లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై, 2019లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై ఓటములను చవిచూసింది. ఇప్పటివరకు ధోనీ లేకుండా సీఎస్‌కే ఐదు మ్యాచ్‌లు ఆడగా.. ఏకంగా నాలుగింటిలో ఓడింది. 2026లో రాజస్థాన్ రాయల్స్‌పై మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

ఎంఎస్ ధోనీ కేవలం కెప్టెన్ మాత్రమే కాదు.. మ్యాచ్‌ను చదివే సామర్థ్యం, ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, చివరి ఓవర్లలో గేమ్‌ను ముగించే నైపుణ్యం అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. అతని లేని సమయంలో జట్టులో ఆత్మవిశ్వాసం తగ్గినట్లు కనిపిస్తుంది. ఐపీఎల్ 2026లో కూడా ధోనీ గాయంతో దూరమవ్వడం సీఎస్‌కేకు పెద్ద సవాల్‌గా మారింది. యువ ఆటగాళ్లు, కొత్త నాయకత్వం ఈ లోటును భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధోనీ లేకపోవడం జట్టు సమతౌల్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Tags:    

Similar News