Mumbai Indians Record: ముంబై ఇండియన్స్ అరుదైన మైలురాయి.. తొలి ఫ్రాంచైజీగా రేర్ రికార్డు!
Mumbai Indians Create History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ అరుదైన మైలురాయి అందుకుంది. టీ20 క్రికెట్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది.
Mumbai Indians Record: ముంబై ఇండియన్స్ అరుదైన మైలురాయి.. తొలి ఫ్రాంచైజీగా రేర్ రికార్డు!
Mumbai Indians Create History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ ముంబై ఇండియన్స్ అరుదైన మైలురాయి అందుకుంది. టీ20 క్రికెట్‌లో 300 మ్యాచ్‌లు ఆడిన తొలి ఐపీఎల్ ఫ్రాంచైజీగా నిలిచింది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం (మార్చి 29) వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై బరిలోకి దిగడంతో ఈ రికార్డు సొంతమైంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఈ అరుదైన రికార్డు సాధించిన మూడో జట్టుగా ముంబై నిలిచింది. ఇప్పటికే పాకిస్తాన్ నేషనల్ క్రికెట్ టీమ్, ఇంగ్లాండ్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ కౌంటీ క్రికెట్ క్లబ్ 303 మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో ముందున్నాయి.
ఐపీఎల్ జట్లలో మ్యాచ్‌ల పరంగా ముంబై ఇండియన్స్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 287 మ్యాచ్‌లతో ముందుండగా.. తరువాత కోల్‌కతా నైట్ రైడర్స్ 281 మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉంది. ముంబై టీమ్ ఐపీఎల్‌లో 18 సీజన్లలో 277 మ్యాచ్‌లు, అలాగే ఛాంపియన్స్ లీగ్ టీ20లో 22 మ్యాచ్‌లు ఆడి మొత్తం 300 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకుంది. ఈ మైలురాయి ముంబై జట్టు స్థిరత్వం, విజయాల ప్రతీకగా నిలుస్తోంది. 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో ఐదు టైటిళ్లు గెలిచి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది.
అయితే సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ జట్టుకి పేలవ రికార్డు ఉంది. చివరిసారి 2012లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై విజయం సాధించింది. మొత్తంగా 18 ఓపెనర్లలో కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచి.. 14 మ్యాచ్‌లు ఓడిపోయింది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి పాలైంది. అయితే ముంబై ఐపీఎల్ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయ విజయాలను, మేటి ఆటగాలను అందించింది. లసిత్ మలింగ డెత్ ఓవర్లలో చేసిన అద్భుత బౌలింగ్, కిరణ్ పోలార్డ్ ఫినిషింగ్ సామర్థ్యం.. అలాగే భారత యువతరం ఆటగాళ్లైన జస్ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్ ఎదుగుదలలో ముంబై కీలక పాత్ర పోషించింది. ఈ సీజన్‌లో ఆరో టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ముంబై.. తమ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించగలదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.