Sanju Samson: సంజు చెత్త రికార్డు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కలిసి రాలేదా?

Sanju Samson: 2026 సీజన్‌ను సంజు శాంసన్‌ పేలవంగా ప్రారంభించాడు. గత ఐదేళ్లుగా ప్రతి సీజన్ తొలి మ్యాచ్‌లో అర్ధశతకం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన సంజు.

Update: 2026-03-30 15:46 GMT

Sanju Samson: సంజు చెత్త రికార్డు.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కలిసి రాలేదా?

Sanju Samson: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో స్థిరమైన ప్రదర్శనతో గుర్తింపు పొందిన ఆటగాళ్లలో సంజు శాంసన్‌ ఒకడు. గత కొన్నేళ్లుగా రాజస్థాన్ రాయల్స్‌ (ఆర్ఆర్)కు ఆడిన సంజు పరుగుల వరద పారించాడు. ఐపీఎల్ 2026 వేలం ముందు ట్రేడ్ డీల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)లోకి వచ్చాడు. అయితే 2026 సీజన్‌ను మాత్రం అతడు పేలవంగా ప్రారంభించాడు. గత ఐదేళ్లుగా ప్రతి సీజన్ తొలి మ్యాచ్‌లో అర్ధశతకం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేసిన సంజు.. ఈసారి మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయాడు. 2026లో తన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కేవలం 6 పరుగులకే ఔట్ అయి చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

2020 నుంచి 2025 వరకు ప్రతి సీజన్ తొలి మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. 2020లో సీఎస్‌కేపై 74 పరుగులు, 2021లో పంజాబ్‌పై సెంచరీ (119), 2022లో సన్‌రైజర్స్‌పై 55, 2023లో కూడా సన్‌రైజర్స్‌పై 55, 2024లో లక్నోపై 82 నాటౌట్, 2025లో మరోసారి సన్‌రైజర్స్‌పై 66 పరుగులు బాదాడు. గత ఐదేళ్లుగా సంజు సీజన్ తొలి మ్యాచ్‌లో తన స్థిరత్వాన్ని చూపించాడు. ఈ గణాంకాలు అతడు లీగ్ మొదటి మ్యాచ్‌ల్లో ఎంత ప్రభావం చూపుతాడో స్పష్టంగా తెలియజేస్తాయి.

అయితే 2026లో మాత్రం సంజు శాంసన్ పరంపరకు తెర పడింది. చెన్నై తరఫున ఆడుతూ 7 బంతుల్లో 6 పరుగులకే వెనుదిరిగాడు. రాజస్థాన్ బౌలర్ నాంద్రే బర్గర్‌ బౌలింగ్‌లో (1.6) సంజు బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 2020 తర్వాత తొలిసారి తొలి మ్యాచ్‌లో 50+ స్కోర్ చేయకుండానే వెనుదిరిగాడు. ఇది శాంసన్‌ ఖాతాలో చెత్త రికార్డుగా చేరింది. సంజు లాంటి కీలక ఆటగాడు విఫలమవ్వడం చెన్నై జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపింది. సంజు అనంతరం చెన్నై వరుసగా వికెట్స్ కోల్పోయింది. 15 ఓవర్లలో 8 వికెట్లను 93 రన్స్ మాత్రమే చేసింది. చెన్నై తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో సంజు విఫలమవడంతో ఫాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సంజుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కలిసి రాలేదా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News