IND vs NAM: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. నమీబియా, పాకిస్థాన్ మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం!
IND vs NAM: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది.
IND vs NAM: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. నమీబియా, పాకిస్థాన్ మ్యాచ్‌లకు స్టార్ ప్లేయర్ దూరం!
IND vs NAM: టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. అమెరికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ విజయాన్ని అందుకుంది. ఇక గురువారం (ఫిబ్రవరి 12) తదుపరి మ్యాచ్‌లో నమీబియాతో సూర్య సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి. యువ క్రికెటర్ అభిషేక్ శర్మ నమీబియాపై ఆడే ఛాన్సెస్ చాలా తక్కువ అని తెలుస్తోంది.
అభిషేక్ శర్మ ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరడం ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. స్టమక్ ఇన్ఫెక్షన్ కారణంగా అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. మంగళవారం అభిషేక్ ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. జట్టు డిన్నర్ సమయంలో అతడికి ఆరోగ్యం క్షీణించడంతో.. టీమ్ మేనేజ్‌మెంట్ వెంటనే ఆస్పత్రికి తరలించింది. వైద్య పరీక్షలు నిర్వహించగా ఇన్ఫెక్షన్ అని తేలింది. ప్రస్తుతం అభిషేక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ.. పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫిట్‌నెస్ పూర్తిగా సాధించేవరకు అభిషేక్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 12న నమీబియా, ఫిబ్రవరి 15న జరిగే పాకిస్థాన్ మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. జట్టులో కీలక ఆటగాడైన అభిషేక్ దూరమైతే.. టీమ్ కాంబినేషన్‌పై ప్రభావం పడే అవకాశముంది. ఒకవేళ అభిషేక్ దూరమైతే.. అతడి స్థానంలో సంజు శాంసన్ ఆడే అవకాశాలు ఉన్నాయి. ఇదే నిజమైతే సంజు అదృష్టవంతుడే అని చెప్పొచ్చు. రెండు మ్యాచులలో నిరూపించుకుంటే.. అభిషేక్ వచ్చినా కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఇక అభిమానులు మాత్రం అభిషేక్ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక జస్ప్రీత్ బుమ్రా జ్వరం నుంచి కోలుకోవడంతో నమీబియాపై ఆడనున్నాడు. మహమ్మద్ సిరాజ్ బెంచిలో ఉంటాడు.
భారత్ తుది జట్టు (అంచనా):
సంజు శాంసన్ (కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.