KKR vs SRH: టాస్‌ గెలిచిన కోల్‌కతా.. సన్‌రైజర్స్ ఫైనల్ 11, ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

KKR vs SRH Playing 11: ఐపీఎల్ 2026లో భాగంగా కాసేపట్లో ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా కోల్‌కతా, సన్‌రైజర్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ రహానే బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

Update: 2026-04-02 14:11 GMT

KKR vs SRH: టాస్‌ గెలిచిన కోల్‌కతా.. సన్‌రైజర్స్ ఫైనల్ 11, ఇంపాక్ట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!

KKR vs SRH: ఐపీఎల్ 2026లో భాగంగా కాసేపట్లో ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో సన్‌రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనున్నాడు. కామెరూన్‌ గ్రీన్‌ త్వరలోనే బౌలింగ్ చేస్తాడని జింక్స్ వెల్లడించాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం అని సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ చెప్పాడు. ఇరు జట్లు తమ మొదటి మ్యాచ్‌లలో ఓడిపోవడంతో.. ఐపీఎల్ 2026లో బోణి కోసం చూస్తున్నాయి. చూడాలి మరి ఎవరు గెలుస్తారో.

ఈ మ్యాచ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఒక మార్పు చేసింది. శివాంగ్‌ కుమార్‌ తుది జట్టులోకి వచ్చాడు. సన్‌రైజర్స్‌ మొదటి మ్యాచ్‌లో 201 పరుగులు చేయగా.. టార్గెట్‌ను ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. బౌలర్లు పూర్తిగా తేలిపోవడంతో సన్‌రైజర్స్‌ ఓడిపోవాల్సి వచ్చింది. కమిన్స్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. జయదేవ్‌ ఉనద్కత్‌, డేవిడ్‌ పేన్‌ ఎలా రాణిస్తారో చూడాలి. మరోవైపు ముంబైపై కేకేఆర్‌ ఓడిపోయింది.

తుది జట్లు:

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: అజింక్య రహానే (కెప్టెన్‌), కామెరూన్‌ గ్రీన్‌, అంగ్‌క్రిష్‌ రఘువంశీ (కీపర్‌), రింకు సింగ్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, అనుకుల్‌ రాయ్‌, సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, వైభవ్‌ అరోరా, కార్తిక్‌ త్యాగి, బ్లెస్సింగ్‌ ముజరబాని.

సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌: అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌ (కీపర్‌, కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, అనికేత్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సలీల్‌ అరోరా, హర్ష్‌ దూబె, శివాంగ్‌ కుమార్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, డేవిడ్‌ పేన్‌.

ఇంపాక్ట్‌ సబ్‌సిట్యూట్లు:

కోల్‌కతా: ఫిన్‌ అలెన్‌, మనీశ్‌ పాండే, సౌరభ్‌ దూబె, రోవ్‌మన్ పావెల్, తేజస్వి దహియా.

సన్‌రైజర్స్‌: హర్షల్‌ పటేల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, ఎషాన్ మలింగ, ఆర్‌ స్మరణ్‌, సాకిబ్‌ హుస్సేన్‌.

Tags:    

Similar News