LSG vs DC: టాస్‌ గెలిచిన ఢిల్లీ.. ఇరు జట్లలో అరవీర భయంకర విదేశీ ప్లేయర్స్, ఆసక్తికరంగా మ్యాచ్‌!

LSG vs DC IPL 2026: ఐపీఎల్‌ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

Update: 2026-04-01 15:02 GMT

LSG vs DC IPL 2026

LSG vs DC IPL 2026: ఐపీఎల్‌ 2026లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా లక్నో ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఇరు జట్లలో అరవీర భయంకర విదేశీ ప్లేయర్స్ ఉండడంతో.. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగనుంది.

లక్నో సూపర్‌ జెయింట్స్‌లో ఐడెన్‌ మార్‌క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌, నికోలస్‌ పూరన్‌, అన్రిచ్‌ నోకియా ఉండగా.. ఢిల్లీలో పాథుమ్‌ నిశ్శాంక, ట్రిస్టన్‌ స్టబ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, లుంగి ఎంగిడి ఉన్నారు. అందరూ మ్యాచ్ విన్నర్లే. మరి ఈరోజు ఎవరు బాగా ఆడుతారో చూడాలి. ఇక కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌కు ఈ సీజన్‌ సవాలే అని చెప్పాలి. పంత్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. గత సీజన్‌లో పంత్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించలేకపోయాడు. దాంతో అందరి కళ్లు ఇప్పడు అతడిపైనే ఉంది. అందరూ ఊహించనట్టే ఫాస్ట్ బౌలర్ మయాంక్‌ యాదవ్‌ ఆడడం లేదు.

తుది జట్లు:

లక్నో సూపర్‌ జెయింట్స్‌: ఐడెన్‌ మార్‌క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌, నికోలస్‌ పూరన్‌, రిషభ్‌ పంత్‌ (కీపర్‌, కెప్టెన్‌), ఆయుష్‌ బదోని, అబ్దుల్‌ సమద్‌, ముకుల్‌ చౌదరి, మోహ్సిన్‌ ఖాన్‌, మహ్మద్‌ షమీ, అన్రిచ్‌ నోకియా, ప్రిన్స్‌ యాదవ్‌.

ఢిల్లీ క్యాపిటల్స్‌: కేఎల్‌ రాహుల్ (కీపర్‌), పాథుమ్‌ నిశ్శాంక, నితీశ్‌ రాణా, అక్షర్‌ పటేల్‌ (కెప్టెన్‌), ట్రిస్టన్‌ స్టబ్స్‌, డేవిడ్‌ మిల్లర్‌, విప్రజ్‌ నిగమ్‌, లుంగి ఎంగిడి, కుల్‌దీప్‌ యాదవ్‌, టి.నజరాజన్‌, ముఖేశ్‌ కుమార్‌.

Tags:    

Similar News