New Zealand History: క్రికెట్‌లో సరికొత్త రికార్డు.. చితక్కొట్టిన న్యూజిలాండ్, భారత్ రేర్ రికార్డు బ్రేక్!
New Zealand Women create history: మహిళల వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ టీమ్ చరిత్ర సృష్టించింది. అమెలియా కెర్ అద్భుత ఇన్నింగ్స్ (179 నాటౌట్)తో మహిళల వన్డేల్లో అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ రికార్డును నమోదు చేసింది.
New Zealand Women create history: మహిళల వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ టీమ్ చరిత్ర సృష్టించింది. అమెలియా కెర్ అద్భుత ఇన్నింగ్స్ (179 నాటౌట్)తో దక్షిణాఫ్రికాపై అసాధారణ విజయాన్ని అందుకున్న కివీస్.. మహిళల వన్డేల్లో అత్యధిక విజయవంతమైన రన్ చేజ్ రికార్డును నమోదు చేసింది. బేసిన్ రిజర్వ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 347 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి.. ఈ రికార్డును ఖాతాలో వేసుకుంది. దాంతో భారత్ రేర్ రికార్డు బ్రేక్ అయింది. గత ఏడాది ఐసీసీ మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 341 పరుగుల లక్ష్యాన్ని చేధించిన రికార్డును కివీస్ (350) బద్దలు కొట్టింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ అమీలియా కెర్ అసాధారణ ప్రదర్శన చేసింది. 139 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సుతో 179 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. అమీలియా సమయోచితంగా ఆడుతూ, అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శిస్తూ జట్టును గెలుపు దిశగా తీసుకెళ్లింది. ఆమెకు ఇసాబెల్లా గేజ్ మంచి సహకారం అందించింది. ఇసాబెల్లా 68 పరుగులు చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఇద్దరు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. చివరి ఓవర్‌లో 11 పరుగులు అవసరమైన సమయంలో కెర్ దూకుడుగా ఆడింది. నదీన్ డి క్లర్క్ బౌలింగ్‌లో బౌండరీలు బాది రెండు బంతులు మిగిలుండగానే జట్టుకు ఊహించని విజయాన్ని అందించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 346 పరుగులు చేసింది. అన్నేకే బోష్ (91), లారా వోల్వార్డ్ (69) రాణించారు. ఇన్నింగ్స్ చివర్లో క్లో ట్రయాన్ (52 నాటౌట్) వేగంగా పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్ మూడు కీలక వికెట్లు పడగొట్టింది. భారీ లక్ష్యాన్ని న్యూజిలాండ్ ఛేదించింది. ఇప్పుడు మహిళా క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. చివరి వన్డే ఏప్రిల్ 4న జరగనుంది.