Mohammad Nabi: అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్‌కి భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ!
అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ సూచనను పాటించకపోవడంతో..
Mohammad Nabi: అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్‌కి భారీ షాక్ ఇచ్చిన ఐసీసీ!
అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీకి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ సూచనను పాటించకపోవడంతో.. నబీ మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఈ విషయాని ఐసీసీ ఓ ప్రకటలో తెలిపింది. అదేవిధంగా ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం లెవల్-1 ఉల్లంఘన కింద అతడి ఖాతాలో ఒక డీమరిట్ పాయింట్ కూడా చేర్చింది. సాధారణంగా లెవల్-1 తప్పిదాలు చిన్న స్థాయి క్రమశిక్షణా ఉల్లంఘనలుగా పరిగణించబడతాయి. అయితే ఇదే పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా మహ్మద్ నబీ ఫీల్డ్ అంపైర్లతో వాగ్వాదానికి దిగాడు. ప్రొటీస్ పేసర్ లుంగి ఎన్‌గిడి ధరించిన రిస్ట్బ్యాండ్‌పై నబీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంపైర్లతో చర్చించగా.. అది వివాదంగా మారింది. ఈ సంఘటన అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ ప్రారంభంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై మ్యాచ్ రిఫరీ ఐసీసీకి నివేదిక సమర్పించడంతో నబీకి షాక్ తగిలింది. ఈ సంఘటనకు సంబంధించి నబీపై మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.4ను నబీ ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఈ నిబంధన ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో అంపైర్ సూచనను అవహేళన చేయడం లేదా పాటించకపోవడం తప్పుగా పరిగణించబడుతుంది.
మైదానంలో ఆటగాళ్లు అంపైర్ల నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత ఉంది. ఐసీసీ నియమాలు అతిక్రమిస్తే జరిమానాలు, డీమరిట్ పాయింట్లు వంటి శిక్షలు విధించడం ఐసీసీ విధానంలో భాగం. మహ్మద్ నబీ వంటి సీనియర్ ఆటగాడు ఇలా వివాదంలో చిక్కుకోవడం అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ఈ ఘటనతో మ్యాచ్‌లో జరిగిన చిన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నబీ మరింత జాగ్రత్తగా ఉండాలని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలానే పునరావుతం అయితే నబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇక దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ మ్యాచ్ మాత్రం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. రెండు సూపర్ ఓవర్లు జరిగిన థ్రిల్లర్ పోరులో చివరకు దక్షిణాఫ్రికా విజయం సాధించింది.