T20 World Cup 2026: ఆసీస్‌కు జింబాబ్వే షాక్.. టీమ్ ఇండియాకు రూట్ క్లియర్? ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా!
T20 World Cup 2026, Zimbabwe vs Australia: టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్! ఈ ఓటమితో భారత్ ప్రపంచ కప్ గెలవడం ఖాయమని నెటిజన్లు ఎందుకు అంటున్నారు? 1983, 2007 నాటి ఆసక్తికరమైన గణాంకాలు మరియు మ్యాచ్ విశేషాలు ఇక్కడ చూడండి.
T20 World Cup 2026: ఆసీస్‌కు జింబాబ్వే షాక్.. టీమ్ ఇండియాకు రూట్ క్లియర్? ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా!
T20 World Cup 2026, Zimbabwe vs Australia: టీ20 ప్రపంచ కప్ 2026లో పెను సంచలనం నమోదైంది. శుక్రవారం ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో జింబాబ్వే 23 పరుగుల తేడాతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా షాక్‌కు గురవ్వగా, భారత అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే, చరిత్రలో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించిన ప్రతిసారీ భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది!
మ్యాచ్ విశేషాలు: మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను జింబాబ్వే బౌలర్లు వణికించారు. బ్లెస్సింగ్ ముజరబాని (4/17), బ్రాడ్ ఎవాన్స్ (3/23) ధాటికి ఆసీస్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాట్ రెన్‌షా (65) పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.
భారత్ టైటిల్ కొట్టడం ఖాయమేనా? ఈ అరుదైన గెలుపు ఒక పాత సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చింది. గతంలో ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించిన రెండు సందర్భాల్లోనూ భారతే విజేతగా నిలిచింది:
1983 వన్డే ప్రపంచ కప్: జింబాబ్వే 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ ఏడాది కపిల్ దేవ్ సారథ్యంలోని భారత్ తొలిసారి వరల్డ్ కప్ నెగ్గింది.
2007 టీ20 ప్రపంచ కప్: సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ టోర్నీలో జింబాబ్వే ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.
ప్రస్తుతం 2026లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడంతో, చరిత్ర పునరావృతమై భారత్ మరోసారి టైటిల్ ఎత్తుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.