Land Mafia in Komaram Bheem District: రెచ్చిపోతున్న భూ బకాసురులు

Update: 2020-07-29 08:18 GMT

Land Mafia in Komaram Bheem District: భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. జాగా కన్పిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలు ఎరజూపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. అధికారుల ఆజ్యం కబ్జాదారుల భూదాహం వెరసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి స్వాహా అవుతోంది. అధికారులు చర్యలు తీసుకోకపోగా తిరిగి ఆక్రమణదారులకే ఆ భూములను కట్టబెడుతున్నారు.

కొమురం భీమ్ జిల్లాలో భూ మాఫియా రేచ్చిపోతుంది. విలువైన సర్కార్ భూములను మాఫియా కబ్జా చేస్తోంది. జిల్లాలోని మండలా కేంద్రాలలో, కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కోట్ల రుపాయల విలువైన సర్కార్ భూములు కబ్జారాయుళ్ల పాలవుతున్నాయి. సర్కార్ భూమి కనిపిస్తే చాలు కబ్జా జెండాలను పాతి తమ అదీనంలోకి తీసుకుంటున్నారు.

కాగజ్ మున్సిపాలిటీ పరిధిలోని బోరిగామ శివారులో యాబై కోట్లు విలువ చేసే సర్కార్ భూమి ఉంది. ఆ భూమిలో రియల్ ఎస్టేట్ మాఫియా వేంచర్లు వేసింది. ఆ వేంచర్లలో భూములను ప్లాట్లుగా విభజించి అమ్ముతుంది. ఈ ఒక్క ప్రాంతంలో అక్రమార్కులు రెండువేల ప్లాట్లను అమ్మెసి కోట్లు సంపాధించుకున్నట్లు సమాచారం. మరోవైపు కోందరు రియల్ వ్యాపారులు అతితెలివి ప్రయోగిస్తున్నారు. గతంలో ఆ ప్రాంతంలో ఇండ్లు ఉన్నాయని నెంబర్లు సృష్టిస్తున్నారు.

సర్కార్‌ భూములను ఏవరికి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సర్కార్‌ ఆదేశాలు ఇచ్చింది. అధికారులకు మాముళ్లు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. మున్సిపల్ చట్టం ఉల్లంఘిస్తూ సర్కార్ భూములను మాయం చేస్తున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇలా అక్రమాలకు పాల్పడుతున్నా భూ మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Full View


Tags:    

Similar News