ఆర్టీసీ బస్సులో పాము కలకలకం.. పామును గమనించి పిల్లల కేకలు

Snake In RTC Bus: ఆర్టీసీ బస్సులో పాము కలకలం రేపింది.

Update: 2023-08-04 12:30 GMT

ఆర్టీసీ బస్సులో పాము కలకలకం.. పామును గమనించి పిల్లల కేకలు

Snake In RTC Bus: ఆర్టీసీ బస్సులో పాము కలకలం రేపింది. కుంటాల మండలం ఒలా నుంచి నిర్మల్‌ వైపు వెళ్లే బస్సులో పామును పిల్లలు గమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ బస్సును నర్సాపూర్ జీ వద్ద నిలిపివేసి పాములు పట్టేవారిని పిలిపించారు. పామును పట్టే క్రమంలో ప్రమాదం పొంచి ఉండటంతో పామును చంపేశారు. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అంతా మంచికే జరిగిందని.. ఒకవేళ మార్గం మద్యలో ఎవరిపైనైనా పాము దాడి చేసి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ నిర్మల్ చేరేంత వరకు ప్రయాణికులు మాట్లాడుకున్నారు. కాగా, ఆ బస్సులోని ఓ ప్రయాణీకుడు ఈ తతంగం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది.  

Tags:    

Similar News