School Holidays: విద్యార్థులకు అదిరిపోయే వార్త.. వరుసగా నాలుగు రోజులు సెలవులు..ఎందుకో తెలుసా?

Update: 2025-03-01 16:37 GMT

Schools and colleges and government offices to remain closed

School Holidays: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. ప్రతినెలా ఏదోక విధంగా సెలవులు వస్తూనే ఉణ్నాయి. ఇప్పుడు న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్. మార్చి నెలలో వరుసగా నాలుగు రోజులు పాఠశాలలు, కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు రానున్నాయి. పూర్తి వివరాలు చూద్దాం.

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత వెంటనే పదో తరగతి, డిగ్రీ పరీక్షలు ప్రారంభం అవుతాయి. పాత అకాడమిక్ ఇయర్ పూర్తవుతుంది. అయితే మార్చిలో వరుసగా నాలుగు రోజులు పాఠశాలలకు, కాలేజీలకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తున్నాయి. మార్చి నెలలో హోలీ పండగ వస్తుంది. హిందువులకు అత్యంత పవిత్రమైన పండగ. ఈ నేపథ్యంలో హోలీ నుంచి వరుసగా 4 రోజులు సెలవులు వస్తున్నాయి.

ఈ సమయంలో పాఠశాలలకే కాదు కాలేజీలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవు. ఈ నెలలో బ్యాంకులు కూడా కేవలం 14రోజులు మాత్రమే పనిచేస్తాయి. ముఖ్యంగా యూపీలో హోళికా దహనం వైభవంగా జరుపుకుంటారు. ఆ రాష్ట్ర క్యాలెండర్ ప్రకారం హోలికా దహనం మార్చి 13న నిర్వహిస్తారు. ఆ రోజు ప్రభుత్వ సెలవుగా ప్రకటించారు. హోలి పండగ శుక్రవారం వస్తుంది. శనివారం కొన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది. మార్చి 15 ఆదివారం ఆ రోజు కూడా సెలవు. ఇలా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. హోలీ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి. మార్చి 17వ తేదీన సోమవారం బ్యాంకులు తెరచుకుంటాయి. ఈ సెలవులు పూర్తయిన 12 రోజులకే వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. మార్చి 29వ తేదీ శనివారం, మార్చి 30 ఆదివారం, మార్చి చివరి తేదీ 31 ఈద్ ఉల్ ఫితర్ సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు ప్రభుత్వ సెలవు ఉంది.


Tags:    

Similar News