Bhupalpally: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్, మరో ఇద్దరికి గాయాలు

Bhupalpally: గాయపడ్డవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలింపు

Update: 2023-11-17 08:53 GMT

Bhupalpally: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్, మరో ఇద్దరికి గాయాలు

Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రేగొండ మండల శివారులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. మోగులపెల్లి మండలంలో ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News